కూటమి పద్మప్యూహంలో జన జాతర | - | Sakshi
Sakshi News home page

కూటమి పద్మప్యూహంలో జన జాతర

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

● అష్ట దిగ్బంధంలో వెంకటగిరి ● వీఐపీల సేవలో తరించిన కూటమి నేతలు ● ప్రత్యేక క్యూలు లేక అవస్థలు పడ్డ చంటి బిడ్డల తల్లులు, దివ్యాంగులు

వెంకటగిరి పోలేరమ్మ జాతరలో సామాన్య భక్తులు నానా తంటాలు పడ్డారు. వీఐపీల పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనం కూటమి నేతలకు మాత్రమే లభించడంతో సామాన్య భక్తులకు నిరాశే మిగిలింది. జన జాతరలో అందరికీ సులభతర దర్శనభాగ్యం కల్పిస్తామని ప్రకటించిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వెంకటగిరి రూరల్‌: వెంకటగిరి జన జాతర కూటమి నేత పద్మప్యూహంలో కొనసాగింది. అడుగు అడుగునా సం ప్రదాయాలకు తిలోదకాలిచ్చారు. అమ్మవారి దర్శనార్థం వ్యయప్రసాయలతో క్యూల వద్దకు చేరుకున్న సామాన్య భక్తులు పలు ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. దీంతో క్యూల వద్ద చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు గురయ్యారు. వికలాంగులకు, చంటి బిడ్డల తల్లులకు కూడా ప్రత్యేకంగా క్యూలైన్‌ ఏర్పాటు చేయకపోవడంతో పలువురు నానా తంటాలు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన దేవదాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ సమక్షంలోనే భక్తులు క్యూలో నుంచి తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

సామాన్య భక్తుల ఇబ్బందులు

సామాన్య భక్తులు తాగేందుకు కూడా గుక్కెడు నీరు అందకు పడరాని పాట్లు పడ్డారు. వీఐపీల పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాలు కూటమి నేతలకు మాత్రమే దక్కడంతో సామాన్య భక్తులకు నిరాశే మిగిలింది. ప్రొటోకాల్‌ అంటూ కొత్త నిబంధనలకు తెరలేపి వీఐపీ క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యూల ద్వారా అధికార పార్టీ నేతలు, పోలీసులకు సంబంధించిన వ్యక్తులను మాత్రమే అనుమతించారు. అమ్మవారి బలికత్తి ఎత్తుకొస్తున్న పనిబాల వారిలో కొందరి రాజా ప్యాలెస్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకోవడంతో బరువుగా ఉన్న బలి కత్తి ఒరిగి అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారిపై పడపోయింది. పక్కనే ఉన్న వారు ఆ కత్తిని అదుపుచేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో పోలీసులకు, పనిబాపల వారికి కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఏదీఏమైనా ఈజాతర కూటమి నేతల కనుసన్నల్లో జరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అష్ట దిగ్బంధంలో వెంకటగిరి

జాతరకు పట్టణంలోకి చిన్న వాహనం కూడా రానీయకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టి వెంకటగిరి పట్టణాన్ని పోలీసు బందోబస్తు మధ్య అష్టదిగ్బంధం చేశారు. పట్టణ పరిధిలోని దూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఉచిత దర్శనంలో భక్తులకు మజ్జిగ, వాటర్‌ బాటల్‌ ప్యాకెట్లను దాతలు సమర్పించినా వాటిని భక్తులకు చేరవేసేందుకు సిబ్బంది తగిన ఆసక్తి చూపలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement