489 మందికి ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

489 మందికి ఉద్యోగాలు

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌మెళాకు విశేష స్పందన లభించింది. తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలతో పాటు పద్మావతి మహిళా పాలిటెక్నిక్‌, ఇతర పాలిటెక్నిక్‌ కళాశాలలకు చెందిన సుమారు 523 మంది విద్యార్థులు జాబ్‌మేళాలో పాల్గొన్నారు. పలు ఎమ్‌ఎన్‌సీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 489 మంది విద్యార్థులను పలు ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసులు ఉద్యోగాలు పొందిన విద్యార్థులు, నిర్వాహకులను అభినందించారు.

చిత్తూరు, తిరుపతిలో

డీఎస్పీల బదిలీ

సాక్షి, చిత్తూరు: చిత్తూరు, తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్త గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు మహిళా స్టేషన్‌లో పనిచేస్తున్న శ్రీనివాసులును గుంతకల్లుకు, చంద్రగిరిలో ఉన్న బి.ప్రసాద్‌ను మదనపల్లెకు, పోస్టింగ్‌ కోసం వేచివున్న ఎస్‌.చంద్రశేఖర్‌ను నగరికి, బాపట్లలో పనిచేస్తున్న పి.జగదీష్‌ నాయక్‌ను చంద్రగిరికి బదిలీ చేశారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ గోగర్భం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 78,723 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,664 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement