లెక్కలేయని ‘జాబితా’ | - | Sakshi
Sakshi News home page

లెక్కలేయని ‘జాబితా’

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

ఇంటింటి సర్వే చేయకనే కులాల వారీగా ఓటరు లిస్టు సిద్ధమని ప్రకటన ఎస్సీ ఎస్టీ ఓటర్లను తగ్గించి చూపేందుకే పన్నాగాలు రిజర్వేషన్‌ స్థానాలు తగ్గించేందుకే కూటమి నేతల ఎత్తుగడ అధికారుల తీరుపై భగ్గుమంటున్న కుల సంఘాలు సాక్షి చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు

●

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలుత మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు శరవేగంగా కసరత్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓటరు జాబితా, డివిజనన్‌ వారీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల నిర్ధారణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషనన్‌లోనూ కులాల వారీ, అలానే మహిళా ఓటర్ల లెక్కలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కులాల వారీగా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఎక్కడ జరిగిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అసంతృప్తి తెరపైకి వచ్చింది. ఇంటింటికి వెళ్లి కులాల వివరాలను సేకరించాల్సిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయంలోనే కూర్చొని లెక్కలు తేల్చినట్లు కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కులాల వారీగా ఎందుకు?

రాజ్యాంగ ప్రకారం ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు ఏడు శాతం రిజర్వేషనన్‌ను్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. అలా ఎస్సీ, ఎస్టీ ఓటర్లు సంఖ్య ఆధారంగా డివిజన్లలో రిజర్వేషన్‌న్‌ను అమలు చేస్తారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కులాల వారీగా పక్కా ఓటర్ల జాబితా కోసం సెప్టెంబర్‌ 24, 25, 26వ తేదీన క్షేత్రస్థాయికి వెళ్లి ఓటర్ల సంఖ్యను తేల్చాలని ఆదేశించింది. ఈ ప్రకారం సర్వే ఎక్కడ జరిగిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కులాల వారీగా ఓటర్ల సంఖ్య ఆధారంగా తిరుపతిలోని 66 డివిజన్లలో ఎన్ని డివిజన్లు రిజర్వు చేయవచ్చు అని నిర్ధారిస్తారు. తక్కువ సంఖ్యను చూపడం వల్ల రిజర్వేషన్లలో భారీ కోత విధించవచ్చు. ఈ క్రమంలోనే కులాల ఓటర్ల సంఖ్య నిర్ధారణ పక్కాగా జరగాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.

కూటమి నేతల కుట్ర

తిరుపతి కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని డివిజన్లో అధికారులు ఎస్సీ ఎస్టీ ఓట్ల సంఖ్య లెక్కలు తేల్చారు. తక్కువగా చూపిస్తే రిజర్వేషన్లలో కోత విధించవచ్చనే దురుద్దేశంలో కూటమి నేతలు ఎస్సీ ఎస్టీల ఓటర్ల సంఖ్యను గుట్టుచప్పుడు కాకుండా తేల్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వారికి తక్కువ సంఖ్యలోనే రిజర్వ్‌ స్థానాలు ఇవ్వచ్చని కుట్రపన్నారు. ఎక్కడ పోలింగ్‌ బూతులు పెట్టాలి, ఎస్సీ ఎస్టీల ఓట్ల సంఖ్య నిర్థారణ వంటి అంశాలు పూర్తిగా స్థానిక అధికారుల చేతుల్లోనే ఉంటుంది. ఇదే కూటమి నేతలకు వరంగా మారింది.

కుల సంఘాల ఆగ్రహం

తిరుపతి కార్పొరేషన్‌ అధికారులు ఎస్సీ, ఎస్టీ ఓటర్ల సంఖ్యను లెక్కించకుండానే జాబితా ప్రకటిస్తామనడంపై కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించలేదని ఆరోపిస్తునారు. ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగానే ఎస్సీ ఎస్టీ ఓటర్ల సంఖ్యను తేల్చలేదని విమర్శిస్తున్నారు.

గెలుపే లక్ష్యం.. అది ఎలాగైనా సరే. ఆధిపత్యం ప్రదర్శించడమే ముఖ్యం.. ఏం చేసైనా సరే. అన్నట్టు చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతోంది. అధికారులను అడ్డపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతోంది. ఇంటింటికీ వెళ్లి సర్వే చేయకుండానే కులాల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశామని ప్రకటించేసింది.

సాక్షి పరీశీలనలో ఇలా..

తిరుపతికి సంబంధించి సెప్టెంబరు 24,25,26 తేదీల్లో ఇంటింటా సర్వే నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సర్వే ఎలా చేశారు, అసలు చేశారా లేదా అనే దానిపై సాక్షి టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ దృష్టి సారించింది. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు వందకు పైగా కుటుంబాలను నేరుగా కలిసింది. ఇప్పటివరకు అధికారులు ఎవరైనా ఓటరు జాబితాతో మీ ఇంటికి వచ్చి మీది ఏ కులం ఏంటని అడిగారా ? అని ప్రశ్నించగా తమ వద్దకు ఎవరూ రాలేదని చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఏ స్థాయిలో కులాల ఓటర్ల సంఖ్య తేల్చారనేది అర్థం చేసుకోవచ్చు.

సర్వే చేయకపోవడం సరికాదు

నగరపాలక సంస్థ ఎన్నికల కోసం అధికారులు కులాల వారీగా ఇంటింటీ సర్వే నిర్వహించకపోవడం సరికాదు. సర్వే చేయకుండా ఓటర్ల జాబితాను విడుదల చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కాలేదు. తక్షణం అధికారులు ఈ విషయంపై పునరాలోచించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఓటర్ల ప్రాతిపదికన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాల్సిందే. కూటమి నేతలకు వంతపాడి రిజర్వేషన్లలో గందరగోళం సృష్టిస్తే ఉద్యమం తప్పదు

– ఎస్‌.జయచంద్ర,

సీఐటీయూ నగర అధ్యక్షుడు, తిరుపతి

ఇది చాలా దారుణం

నగరంలో అధికారులు కుల గణన చేయకనే చేసినట్లు జాబితా ప్రకటిస్తామని చెప్పడం చాలా దారుణం. కార్యాలయాల్లో కూర్చొని కదలకుండా కుల గణన వివరాలు నమోదు చేశారనే అనుమానం ఉంది. మా వార్డులో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఎలా లెక్క కట్టారో చెప్పాలి. మాకు తెలియకుండా మాది ఏ కులమో ఎలా నిర్ణయించారని ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తోంది. కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారు

– గౌడపేరు చిట్టిబాబు, కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు

అన్యాయం జరిగితే ఊరుకోం

నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా కులాల వారీ ఓటర్ల జాబితా ఎలా చేశారో అధికారులు ప్రజలకు చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల జాబితా కోసం ఇంటింటి సర్వే నిర్వహించకుండా తమ ఇష్టానుసారం జాబితా విడుదల చేస్తే ఊరుకునేదిలేదు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయపరంగా అందాల్సిన రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాల్సిందే. కూటమి నేతల ఆదేశాలకు తలొగ్గి అధికారులు వ్యవహరించకుండా కచ్చితమైన ఓటర్ల జాబితాను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఉద్యమిస్తాం

– కె.జ్యోతీశ్వర్‌ నాయక్‌, ఆదివాసి కాంగ్రెస్‌ కమిటీ జిల్లా చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement