భ్రాంతిగానే భృతి
నిరుద్యోగలను బాబు సర్కార్ నట్టేట ముంచింది. ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేల భృతి ఇస్తామంటూ ఊదరగొట్టి ఇప్పుడు మోసం చేసింది. ఇప్పటికీ నిరుద్యోగులు భృతి అందిస్తారనే ఆశతో ఉన్నారు. కానీ, కూటమి సర్కార్ ఆ విషయంపై స్పందించం కూడా మానేసింది. ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. నిరుద్యోగులను ఆదుకునే విషయాన్ని పక్కన పెట్టి కొత్తగా తమ అనుచరులకోసం, తమ ప్రభుత్వ ప్రచారానికి సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్లంటూ మరో డ్రామాకు తెరలేపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ నగదును నిరుద్యోగులకు చెల్లించాలి.
– జెన్నే మల్లికార్జున,
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి
ఆడబిడ్డ నిధి పేరుతో ద్రోహం
అధికార దాహంతో హామీలను గుప్పించి మహిళలను మభ్యపెట్టి అధికారం చేపట్టారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి తీరుతా అంటూ చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. మహిళలకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసింది. చేతులెత్తేసి మా వల్లకాదు అంటూ మాయమాటలు చెబుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో తమ డప్పుకొట్టించుకునేందుకు ఇన్‌ఫ్ల్యూన్సర్లకు ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి ఉపసంహరించుకుని ఆడబిడ్డనిధిని బకాయిలతో పాటు పూర్తిగా చెల్లించాలి. – సరస్వతీదేవి, ప్రైవేటు ఉద్యోగి, తిరుపతి


