ఎమ్మెల్యేలకు ‘స్థానిక’ పరీక్ష! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు ‘స్థానిక’ పరీక్ష!

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

అన్ని స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేయించే బాధ్యత మీదే

వైఎస్సార్‌సీపీ శ్రేణులు నామినేషన్లు వేయకుండా చూసుకోండి

ప్రతిపక్షంలోని బలమైన నేతలను మన పార్టీలోకి లాగండి

ఒక్క స్థానం పోయినా సార్వత్రిక ఎన్నికల్లో టికెట్‌ డౌటే

నెగ్గేందుకు ఏంచేసినా అధికారులు సహకరిస్తారు

తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన మంత్రి లోకేష్‌?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదే. వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోటీలో లేకుండా చూసుకోవాలి. ఎవరైనా నామినేషన్‌ వేసినా పరిశీలనలో తిరస్కరించే బాధ్యత అధికారులు చూసుకుంటారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలోని బలమైన నేతలకు మన కండువా కప్పేయండి. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ఏం చేసినా ఉన్నతాధికారులు సహకారం అందిస్తారు. ఈ పోరులో అన్ని స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేయలేకపోతే అక్కడి ఎమ్మెల్యేలకు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఉండవు’’ అని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేష్‌ తెగేసి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి నారా లోకేష్‌ శ్రీవారి దర్శనం కోసం సోమవారం రాత్రి రేణిగుంటకు చేరుకుని నేరుగా తిరుమలకు వెళ్లారు. మంగళవారం శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తేనే టికెట్‌

స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తేనే టికెట్‌ ఉంటుందని.. ఒకవేళ పార్టీని గెలిపించలేకపోతే 2029 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్‌ దక్కడం కష్టమేనని హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తిరుపతి రూరల్‌, రేణిగుంట మండలాల బాధ్యతను తుడా చైర్మన్‌ డాలర్స్‌ దివాకర్‌ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో ఈ రెండు మండలాలు స్వీప్‌ చేయిస్తేనే ఎమ్మెల్యే టికెట్‌ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

లోకేష్‌ దిశా నిర్దేశం

తిరుపతిలో ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ప్రకటించే అవకాశముందని, ఈ మేరకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని.. చిత్తూరుతో పాటు మిగిలిన మున్సిపాలిటీలన్నీ స్వీప్‌ చేయాలని ఆదేశించారని ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించే పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుందని, ఇది వారి పనితీరుకు పరీక్షగా భావిస్తామని లోకేష్‌ తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఎలాగైనా

సరే..

స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి చాలా ప్రతిష్టాత్మకమని.. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి లోకేష్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు నామినేషన్‌ వేయకుండ పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒక వేళ ఎవరైనా నామినేషన్‌ వేస్తే.. పరిశీలనలో వాటిని తిరస్కరించేలా చర్యలు తీసుకునే బాధ్యత జిల్లా ఉన్నతాధికారికి అప్పగించినట్లు టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఏదైనా గొడవలు జరిగితే.. కేసులు పెట్టి జైల్లో పెట్టాలని పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు. పార్టీని గెలిపించేందుకు అధికార యంత్రాంగమంతా టీడీపీ నేతలు, కార్యకర్తలకు పూర్తి సహకారం అందిస్తారని ఎమ్మెల్యేలకు మంత్రి నారా లోకేష్‌ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ విజయం కోసం ప్రతి నియోజకవర్గంలో బలమైన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను ఎలాగోలా ఆకర్షించి పసుపు కండువా కప్పేయాలని సూచించినట్లు సమాచారం. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement