వేదిక్‌ వర్సిటీ వీసీగా గణపతి భట్‌ | - | Sakshi
Sakshi News home page

వేదిక్‌ వర్సిటీ వీసీగా గణపతి భట్‌

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నూతన వైస్‌ చాన్సలర్‌గా జాతీయ సంస్కృత వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ కే.గణపతి భట్‌ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్‌, వర్సిటీ ఛాన్సలర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత వీసీ రాణి సదాశివమూర్తి పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన వీసీగా గణపతి భట్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రొఫెసర్‌ గణపతి భట్‌ గత 25 సంవత్సరాలుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని అద్వైత వేదాంత విభాగంలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. అకడమిక్‌ డీన్‌గా, వేదం, వేదాంతం, జ్యోతిష శాస్త్రాలలో విశేష పాండిత్యం గడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement