పింఛన్ల పంపిణీలో మార్పులు | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీలో మార్పులు

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

తిరుపతి అర్బన్‌ : సామాజిక పింఛన్ల పంపిణీలో నవంబర్‌ నెల నుంచి పలు మార్పులు చేయనున్నారు. అక్టోబర్‌ నుంచి విజయనగరం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు పేరుతో మార్పులను అమలు చేస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు. ప్రధానంగా వృద్ధాప్య పింఛన్‌కు సంబందించి (60–79) రూ.200లను బ్యాంకులో జమ చేస్తారు. మిగిలిన రూ.3,800 చేతికి అందజేస్తారు. అలాగే 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 బ్యాంకులోను, రూ.3,500 చేతికి ఇస్తారు. వితంతు పింఛన్‌కు సంబందించి (80 ఏళ్లు పైబడిన వారికి) రూ.500 బ్యాంకులోను, రూ.3,500 చేతికి ఇవ్వనున్నారు. వికలాంగుల పింఛన్‌కు సంబందించి (18–79) వయస్సు వారికి రూ.300 బ్యాంకులోను, రూ.5,700 చేతికి ఇవ్వనున్నారు. వికలాంగుల పింఛన్‌కు సంబందించి (80 ఏళ్లు పైబడిన వారికి) రూ.500 బ్యాంకులోను, రూ.5,500 చేతికి ఇస్తారు. ఆ దిశగా జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది.

గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు

తిరుపతి అర్బన్‌: జిల్లాలోని గ్రామీణ విలేకరులకు అక్టోబర్‌ 3, 4 తేదీల్లో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్టు సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేష్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూలో ఉన్న సెనేట్‌ హాల్‌లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో అనుభవజ్ఞులైన పాత్రికేయులు పత్రికా కథనాలకు సంబందించి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు.

త్వరిగతిన పెండింగ్‌

ప్రాజెక్టుల పనులు

తిరుపతి తుడా: స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా తిరుపతి నగరంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని స్మార్ట్‌ సిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. ఆయన గురువారం 45వ స్మార్ట్‌ సిటీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్‌ సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.జయకృష్ణ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ బిల్డింగ్‌ పనులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్మార్ట్‌ సిటీ ద్వారా చేపట్టిన ఇండోర్‌ స్టేడియం, స్విమ్మింగ్‌ పూల్‌, గ్లో గార్డెన్‌, వినాయక సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించారు. బోర్డు సమావేశంలో ఎస్పీ సుబ్బరాయుడు, తుడా వైస్‌ చైర్మన్‌, జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు, అదనపు కమిషనర్‌ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు

ఎస్పీడబ్ల్యూ విద్యార్థులు

తిరుపతి సిటీ: సెట్విన్‌ ఆధ్వర్యంలో ఎస్వీ పశువైద్య కళాశాల వేదికగా బుధవారం నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భువనేశ్వరి మాట్లాడుతూ జిల్లా యువజనోత్సవాల్లో గ్రూప్‌ డ్యాన్స్‌ జానపద విభాగంలో కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించారని తెలిపారు. వారు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

28 వరకు

డీఫార్మసీ స్పాట్‌ అడ్మిషన్లు

తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల కాలవ్యవధితో నడుస్తున్న డీఫార్మసీ కోర్సులో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28వ తేదీ వరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎస్‌.శ్రీనివాసులు తెలిపారు. డీఫార్మసీ కోర్సులో చేరదలిచిన విద్యార్థులు ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement