శాస్త్రాల సమన్వయంతోనే పరిశోధనలకు కొత్త రూపు వస్తుందని బెంగళూరు ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ రంగరాజన్ తెలిపారు.
అర్హులందరికీ
ఓటు హక్కు
బుచ్చినాయుడుకండ్రిగ: ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి, అర్హుల పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే సర్ ఉద్దేశమని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు గంధం చంద్రుడు తెలిపారు. ఆయన గురువారం బుచ్చినాయుడుకండ్రిగలో పలు ఇళ్లకు వెళ్లి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల వివరాల్లో తప్పులు, మార్పులు, పేర్లు నమోదు వంటి సమస్యలుంటే సర్‌కార్యక్రమంలో అధికారులు పరిశీలించి,సరిచేస్తారని తెలిపారు. ఓటర్లు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, ఓటు సవరణలు, అభ్యంతరాలుంటే సంబంధిత ఫారాలను సమర్పించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ శ్రీనివాసులు, ఈఆర్‌ఓ నాగార్జున్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ నల్లయ్య, వీఆర్‌ఓ బాలమురళి, కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్‌కుమార్, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
స్విమ్స్‌లో ఉచిత వినికిడి పరీక్షలు
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో శనివారం ఉదయం పది గంటలకు అంతర్జాతీయ బధిరుల వారోత్సవాల సందర్భంగా ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈఎన్‌టీ వైద్య విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. పద్మావతి ఈఎన్‌టీ ఓపీడీ విభాగంలో ఆడియాలజికల్ స్క్రీనింగ్, వినికిడి మదింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వినికిడి లోపం ఉన్నవారు, వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


