తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారు 100 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ప్రిన్సిపాల్ కే చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. కార్యక్రమంలో రుయా మోడల్ బడ్ల్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవి, రుయా వైద్య సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు చంద్రయ్య, డాక్టర్ సుజన్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


