తిరుపతి రూరల్: పాకాల బస్టాండ్‌లో గురువారంచిల్లర విషయంలో తలెత్తిన వివాదం వృద్ధ ప్రయాణికుడిపై ఆర్టీసీ బస్సు కండక్టర్ చేయిచేసుకునే వరకు వెళ్లింది. బాధితుని వివరాల మేరకు.. పుంగనూరు డిపో బస్సులో ప్రయాణించిన ఒక వృద్ధుడు తనకు రూ.5 చిల్లర ఇవ్వాలని పదేపదే అడిగాడు. దీంతో కండక్టర్ ఆగ్రహానికి గురై చేయిచేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించాడు. కండక్టర్‌పై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర విషయంలో వృద్ధుడిపై దాడికి పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, సంబంధిత కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కండెక్టర్ దాడి చేసిన ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


