అరుదైన శస్త్రచికిత్స విజయవంతం | - | Sakshi
Sakshi News home page

అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల ప్రసూతి ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన సర్వైకల్‌ ఫైబ్రాయిడ్‌ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కార్వేటినగరం మండలం పోడలపల్లికి చెందిన మహిళకు (55) గర్భాశయంలో సుమారు 3 కిలోల బరువున్న భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్‌ కణితికి హిస్టరెక్టమీ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద ఉచితంగా శస్త్ర చికిత్సను నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడారు. వైద్యబృందాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవిప్రభు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రమీల దేవి, వైధ్యాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement