కేతన్‌ క్రిష్‌ రెడ్డికి రూ.4.10 లక్షల రీసెర్చ్‌ గ్రాంట్‌ | - | Sakshi
Sakshi News home page

కేతన్‌ క్రిష్‌ రెడ్డికి రూ.4.10 లక్షల రీసెర్చ్‌ గ్రాంట్‌

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతికి చెందిన పదో తరగతి విద్యార్థి బి.కేతన్‌ క్రిష్‌రెడ్డి రూ.4.10 లక్షల అమెరికన్‌ రీసెర్చ్‌ గ్రాంట్‌ను అందుకున్నాడు. బాలుడు అకార్డ్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అంగారక గ్రహంపై అణు విద్యుత్‌ లూప్‌లకు హీట్‌ సింక్‌పై అతను రాసిన శాసీ్త్రయ సారాంశానికి అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్‌ ఫెడరేషన్‌ (ఐఏఎఫ్‌) ప్రశంసలు కురిపించింది. అక్టోబరులో టర్కీలో అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్‌ ఫెడరేషన్‌ (ఐఏఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 77వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్‌ కాంగ్రెస్‌ (ఐఏసీ–2026)కు ఆహ్వానించింది. అతన్ని ప్రోత్సహిస్తూ అమెరికాలోని వాషింగ్‌టన్‌ నగరంలో ఉన్న జార్జ్‌ మేసన్‌ యూనివర్సిటీ రూ.4.10 లక్షలు మంజూరుచేసింది. కేతన్‌ క్రిష్‌ రెడ్డి ఇదివరకే ఇస్రో ప్రతిష్టాత్మకమైన యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రామ్‌ యువికా 2026కు ఎంపికయ్యాడు.

నేటి నుంచి జాతీయ స్థాయి ఆదివాసీ మహోత్సవాలు

తిరుపతి సిటీ: ట్రైబల్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జాతీయస్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలు శుక్రవారం ప్రారంభించనున్నట్టు టీఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్‌ తెలిపారు. ఆయన గురువారం వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదివాసీ, గిరిజన కళాకారులు పాల్గొని తమ సంప్రదాయ కళలు, జానపద నృత్యాలు, సంగీతం, కళారూపాలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఆదివాసీల విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేయడమే మహోత్సవాల ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర కార్యదర్శి విష్ణు నాయక్‌, తెలంగాణ అధ్యక్షుడు నరేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement