నేడు పీటీసీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పీటీసీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

చంద్రగిరి: పోలీసు శిక్షణ తరగతులను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించనున్నారు. కల్యాణి డ్యామ్‌ సమీపంలోని పోలీసు ట్రైనింగ్‌ కళాశాల(పీటీసీ)లో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. పీటీసీ ప్రిన్సిపాల్‌ మహేష్‌ కుమార్‌ గురువారం మైదానంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మండపల్లి రాం ప్రసాద్‌ రెడ్డి, ఎంపీ ప్రసాద రావు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. ఆయన వెంట వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు గారు, అడిషన్‌ ఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి, హెచ్‌ఎల్‌ఐలు వెంకటేశ్వర్లు, నీలయ్య సిబ్బంది పాల్గొన్నారు.

స్విమ్స్‌లో రాష్ట్ర స్థాయి పీజీ క్విజ్‌ పోటీలు

తిరుపతి తుడా: నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ చెస్ట్‌ ఫిజీషియన్స్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ సంయుక్తంగా గురువారం స్విమ్స్‌లో రాష్ట్రస్థాయి పీజీ క్విజ్‌ పోటీలు నిర్వహించినట్లు డీన్‌ అలోక్‌ సచన్‌ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన పీజీ వైద్య విద్యార్థులు పోటీలో పాల్గొని ప్రతిభ చూపారని చెప్పారు. విశాఖకు చెందిన ఎన్‌ఆర్‌ఐఐఎంకు చెందిన డాక్టర్‌ మునుసూరు భావన ప్రథమ స్థానంలో నిలిచి రూ.5 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారని తెలిపారు. అలాగే రెండవ బహుమతిని విశాఖకు చెందిన జీవీపీఐహెచ్‌సీఎంటీకి చెందిన డాక్టర్‌ వెంకటసాయి నిఖిల్‌ గెలుచుకున్నారని తెలిపారు. మెడిసిన్‌ విభాగాధిపతి సీనియర్‌ గ్రేడ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అల్లాడి మోహన్‌, వైద్యులు భార్గవ్‌, ఎంసీఆర్‌ రామ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement