28న జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

28న జాబ్‌ మేళా

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

తిరుపతి అర్బన్‌: రైల్వే కోడూరులోని శ్రీసాయి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో ఈ నెల 28వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. ఆయన గురువారం జేసీ గోవిందరావుతో కలిసి కలెక్టరేట్‌లో జాబ్‌ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 12 ప్రముఖ బహుళజాతి కంపెనీల ప్రతినిధులు జాబ్‌ మేళాలో పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై, 18 నుంచి 35 ఏళ్లలోపు యువతీ, యువకులు ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కూడా ఉందని సూచించారు. అదనపు సమాచారం కోసం 9052717078, 9988853335 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీఎం రవికుమార్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారి ఆర్‌.లోకనాథం, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్లు సునేష్‌ బాబు, సులేమాన్‌ బాష పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement