శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూడో రోజైన గురువారం పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేదపండితులు, అర్చకులు శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement