విభూది గణపతికి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

విభూది గణపతికి వీడ్కోలు

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

తిరుపతి రూరల్‌ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తుమ్మలగుంటలో కొలువుదీరిన విభూది విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. 10 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నిమజ్జనకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి హాజరై విభూది వినాయకుడిని దర్శించుకున్నారు. బాల వినాయక కమిటీ చైర్మన్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

చక్రతీర్థంతో ప్రత్యేక అభిషేకం

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా లభించిన చక్రతీర్థంతో విభూది వినాయకుడికి ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి నిమజ్జనోత్సవానికి శ్రీకారం చుట్టారు. మోహిత్‌ రెడ్డి, హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహంలోని పవిత్ర విభూదిని ప్రసాదంగా స్వీకరించేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రతి ఒక్కరికీ పవిత్ర విభూదిని ప్రసాదంగా అందించేలా కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement