రేణిగుంట: మండలంలోని పిల్లపాళ్యం దళితవాడలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. రేణుకార్జున్ (47) అనే వ్యక్తి తన భార్య రూప కూతురు భవ్యతో కలిసి పంచాయతీ వాటర్ ట్యాంక్ పక్కన కాపురం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి వాటర్ ట్యాంక్ నిండి నీరు కిందపడుతుండడంతో రేణుకార్జున్ మోటార్ ఆఫ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. కుటుంబీకులు వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రేణుకార్జున్ మరణించాడు. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


