‘త్రిశూల్‌’ అమలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

‘త్రిశూల్‌’ అమలు తప్పనిసరి

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

తిరుపతి అర్బన్‌ : జిల్లాలో ఆపరేషన్‌ త్రిశూల్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో డ్రగ్స్‌ వద్దు బ్రో పేరిట బ్యానర్‌ను ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ త్రిశూల్‌లో భాగంగా ప్రధానంగా డ్రగ్స్‌ నివారణ, మహిళలు, పిల్లలకు రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి ఈ అంశంపై అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో 48 ప్రమాదకరమైన మలుపులను గుర్తించామని, ఆ మేరకు బ్లాక్స్‌ స్పాట్ల వద్ద చేపట్టే పనులు సంతృప్తికంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆర్‌టీఓ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు బ్లాక్‌స్పాట్స్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో గోల్డెన్‌ అవర్‌తో అత్యవసర సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ డ్రగ్స్‌ నియంత్రణకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్‌ త్రిశ్రూల్‌లో భాగంగా డ్రగ్స్‌తోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు, మహిళా భద్రతకు ప్రత్యేక నిఘా పెడతామని వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, శ్రీలత, డీటీసీ మురళీమోహన్‌, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌, డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement