ముగిసిన విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

నారాయణవనం: విశ్వగురు సంకల్పం సిద్ధించాలని, దైవబలం చేకూరాలని స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న ‘భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం‘ పూర్ణాహుతితో బుధవారం ముగిసింది. ఉదయం ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సర్వ దేవత మూల మంత్ర హోమం, మహా శాంతి యాగం నిర్వహించారు. కళాశాల చైర్మన్‌ అశోక్‌రాజు దంపతులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్‌, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, నేత రమేష్‌ నాయుడు తదితరులు పాల్గొని హోమ గుండంలో పూర్ణాహుతి సమర్పించారు. యాగ నిర్వాహకులు అశోక్‌ రాజు దంపతులు మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సర్వశక్తులనూ ప్రసాదించాలని, భారత దేశం విశ్వగురుగా నిలవాలనే సంకల్పం నెరవేరాలని ఈ యాగం తలపెట్టినట్లు వివరించారు. తొమ్మిది రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సుదర్శన, ధన్వంతరి, మహాలక్ష్మి, ఆయుష్యు, అకల్మష, శాంతి, సంకల్పసిద్ది హోమాలను, వెంకటేశ్వరస్వామి, సీతా రాముల కల్యాణం, సుందరకాండ పారాయణంతో పాటు ప్రముఖుల ధార్మిక ప్రవచనాలతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికమయమైదని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement