అక్రమ కేసులకు భయపడం | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడం

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

తిరుపతి లీగల్‌: కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, ఎదురుదాడి చేయడం తప్ప ప్రజలకు ఎటువంటి సేవలు అందడం లేదని తిరుపతి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పసుపులేటి సురేష్‌, వాసు యాదవ్‌తో పాటు మరికొంతమంది తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌ ఇంటి వద్ద దాడికి పాల్పడ్డారన్న అభియోగం కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ కేసులో ఆరుగురు వైఎస్సార్‌సీపీ నాయకులు, ఓ మీడియా ప్రతినిధి తిరుపతి సబ్‌ జైల్లో రిమాండ్‌ లో ఉన్నారు. మంగళవారం భూమన అభినయ్‌ స్థానిక సబ్‌ జైల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అక్రమ నియామకాల పట్ల సీబీఐ దర్యాప్తు చేయాలని జగనన్నతోపాటు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తుంటే కూటమి నాయకులు వారిపై ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దాడులను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఐ.చంద్రశేఖర్‌రెడ్డి, నరహరరెడ్డి, దొరబాబు, కొత్తపల్లి విజయకుమార్‌, రాజశేఖర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement