తిరుపతి రూరల్: పట్టణాల రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా తిరుపతి జిల్లాకు రూ.206 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా హెచ్‌ఏఎం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి మహిళా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో జరిగిన ఆ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో ఒక్క తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోనే రూ.106 కోట్ల విలువైన పనులు ఉన్నాయన్నారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ, తుడా చైర్మన్‌న్ డాలర్స్ దివాకర్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎస్‌వీబీసీ చైర్మనన్ శ్రీధర్‌వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


