తిరుపతి అర్బన్: తిరుపతి జిల్లాలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మినరల్ బ్లాక్‌కు సంబంధించి జిల్లా గనుల, భూగర్భ శాఖ.. కోల్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరక కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమక్షంలో ఇరువురు ఒప్పందపు పత్రాలను అందుకున్నారు. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా కోల్ ఇండియా కంపెనీ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల మండలాలు, అలాగే చిత్తూరు జిల్లాలోని పెనుమూరు, వేదురుకుప్పం మండలాల పరిధిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఖనిజాల ఉనికి, నాణ్యత, పరిమాణం, భౌగోళిక వివరాలను శాసీ్త్రయ పద్ధతుల్లో పరిశీలించనున్నారు


