రేపటి నుంచి లాసెట్‌ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి లాసెట్‌ కౌన్సెలింగ్‌

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

తిరుపతి సిటీ: ఎట్టకేలకు లాసెట్‌–2026 కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం తేదీలను విడుదల చేసింది. గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు ఏపీ లాసెట్‌కు సంబంధించి యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

29 నుంచి బీఈడీ ప్రవేశాలకు..

ఏపీ ఎడ్‌సెట్‌–2026కు సంబంధించి ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఈనెల 29వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 29 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుందని, 5 నుంచి 8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని, వచ్చే నెల 12న తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

తిరుపతి మంగళం : డ్రైవింగ్‌ లైసెన్స్‌కు మొబైల్‌ నంబర్‌ను సెప్టెంబర్‌ 25లోపు అప్‌డేట్‌ చేయకపోతే లైసెన్‌న్స్‌ రద్దవుతుందని, చెల్లుబాటు కోల్పోతుందని సోషల్‌ మీడి యా, వాట్సాప్‌లలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌ తెలిపారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఈ ప్రచా రాన్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే రవాణా శాఖ సేవలు, చలానాలు, రెన్యూవల్‌ తదితర సమాచారాన్ని సకాలంలో పొందేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ప్రయోజనకరమని తెలిపారు.

ముగిసిన శిక్షణ

తిరుపతి తుడా: స్విమ్స్‌ మైక్రోబయాలజీ, క్లినికల్‌ వైరాలజీ సంయుక్త ఆధ్వర్యంలో జూనోటిక్‌ వ్యాధుల సెరోలాజికల్‌ నిర్ధారణపై ప్రయోగశాల సాంకేతిక వైద్య సిబ్బందికి రెండు రోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 24 మంది అతిథులు, నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒన్‌ హెల్త్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అంజువర్మ మాట్లాడుతూ ప్రయోగశాల సాంకేతిక సిబ్బందికి జూనోటిక్‌ వ్యాధుల సెరోలాజికల్‌ నిర్ధారణ, నమూనాల సేకరణ, నమూనాల రవాణా, నిర్వహణ, వివిధ ప్రయోగశాలల పరీక్షా విధానాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి ధృవపత్రాలను అందజేశారు.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

తిరుపతి ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ పిలుపునిచ్చారు. డీఈఓ కార్యాలయంలో మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా జిల్లాలోని 320 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాలు, పదో తరగతి బోధించే 2,500 మంది ఉపాధ్యాయులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పరీక్షల ముందు హడావుడి కాకుండా ఇప్పటి నుంచే విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని పరిశీలించి, ఎక్కడ వెనుకబడ్డారో గుర్తించాలన్నారు. అలాంటి వారికి ప్రత్యేక బోధన అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement