శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. నిత్యపూజల్లో జరిగే దోషాలను నివారించి మూలవిరాట్లకు పునరుత్తేజం తెచ్చే విధంగా ఈ పూజలు చేశారు. ఐదు రోజుల పాటు ఈ పూజలు జరగనున్నాయి. తొలి రోజు ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో గురుదక్షిణా మూర్తి సన్నిధి వద్ద శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మ హర్షి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అభిషేక పూజలు చేపట్టారు. ఉత్సవర్లకు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూర్ణహారతులు సమర్పించా రు. తర్వాత శ్రీ– కాళ– హస్తి, భరద్వాజ ఉత్సవమూర్తులను పురవీధు ల్లో ఊరేగించారు. భక్తు లు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాలకమండలి సభ్యులు, ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ పాల్గొన్నారు.


