శ్రీకాళహస్తి: పట్టణ నడిబొడ్డున ఉన్న కుమారస్వామి తిప్పపై అక్రమ నిర్మాణాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాణం కోసం కొండను బ్రేకర్ యంత్రంతో తొలిచే పనులు చేపట్టగా ఆలయ సిబ్బంది ఆదివారం అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగు చూశాయి. ఎవరో కుమారస్వామి కొండను బ్రేకర్లతో తొలుస్తుంటే ఆలయ సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటన బయటకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ బ్రేకర్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తుఫాన్ సెంటర్‌లోనూ నిర్మాణాలు?
ఇదిలా ఉండగా తుఫాన్ సెంటర్ ప్రాంతంలో ఆలయానికి సంబంధించిన భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం గుర్తించిన ఆలయ సిబ్బంది అక్కడ కూడా పనులను అడ్డుకున్నట్లు సమాచారం. ఊరికి దూరంగా రాజీవ్ నగర్ ప్రాంతంలో అక్రమణాలు జరిగాయి అంటూ 250 పైగా పునాదులు, ఇళ్లు కూల్చారు. మరి ఇది కనబడడం లేదా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


