నాగలాపురం: డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన వ్యక్తిగత సమస్యపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఏకంగా ప్రయాణికులను స్టేషన్ వద్దకు తీసుకొచ్చిన ఘటన నాగలాపురంలో చోటు చేసుకుంది. పిచ్చాటూరు మండలం, రామగిరి గ్రామానికి చెందిన వికేష్‌నాయుడు తిరుమల డిపోకు చెందిన చైన్నె–తిరుమల ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం డ్యూటీలో ఉన్న సమయంలో తన వ్యక్తిగత సమస్యకు సంబంధించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు బస్సులో ప్రయాణికులని తిరుమల నుంచి ఎక్కించుకొని నాగలాపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చి వెళ్లాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు కొంతసేపు పోలీసు స్టేషన్ వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యూటీ సమయంలో వ్యక్తిగత సమస్య పరిష్కారం కోసం పోలీసు స్టేషన్‌కు రావడం వల్ల కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.


