కొత్త ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

కొత్త ఉద్యోగాలు

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

శాశ్వత ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేస్తామన్న సీఎం ఉద్యోగాలు ఇస్తే ఆదాయం జీతాలకే వెళ్తుందనడంపై ఆగ్రహం మండిపడుతున్న నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు

‘శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు. కొత్తగా ఉద్యోగాలిస్తే.. వచ్చే ఆదాయం వారి జీతాలకే వెళ్తుంది. ఇప్పటికే 50 శాతం వరకు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తున్నాం.’ అంటూ సీఎం చంద్రబాబు చేసిన వాఖ్యలపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు సవాలక్ష హామీలిచ్చి.. నిరుద్యోగ భృతి అంటూ మభ్యపెట్టి ఓట్లు దండుకుని అధికార పీఠం ఎక్కాక శాశ్వత ఉద్యోగులు వద్దన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగులు, కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య విబేధాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని హితవు పలుకుతున్నారు.

శాశ్వత ఉద్యోగాలకు చెక్‌

కొద్దిపాటి ఉద్యోగులను భర్తీ చేసి.. శ్రీవారి సేవకుల సేవల్ని ఉచితంగా వినియోగించుకునే విధానం అమలు చేయాలని సీఎం చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇప్పటికే టీటీడీలో శ్రీవారి సేవకులతో అన్నదానం, క్యూలైన్‌ మేనేజ్మెంట్‌ వినియోగిస్తున్నారు. అన్నదానంలో కూరగాయలు తరగడం నుంచి, వడ్డించే వరకు శ్రీవారి సేవకులే విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు శ్రీవారి భక్తులకు గుండుకొట్టే కళ్యాణ కట్ట క్షురకుల్లో కూడా కేవలం పీస్‌ రేట్‌ కింద శ్రీవారి సేవకుల్ని వినియోగించుకుంటుఊ.. శాశ్వత ఉద్యోగాల భర్తీకి చెక్‌ పెట్టారు. రానున్న రోజుల్లో ఇదే విధానం అన్ని విభాగాల్లో అమలు చేసే దిశగా అడుగులు వేస్తే తమ పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: టీటీడీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీటీడీలో ఇకపై శాశ్వత ఉద్యోగాలు భర్తీ లేకుండా శ్రీవారి సేవకులతో భర్తీ చేసే విధానం అమలు చేస్తామని సీఎం వ్యాఖ్యానించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ వ్యాఖ్యలు ఉద్యోగులు, కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి.

బాబొస్తే జాబు పోయినట్టేనా?

బాబొస్తే జాబు వస్తుంది అంటూ 2014–19 ఎన్నికల్లో ఊదరగోట్టారు. బాబు వచ్చారు.. నిరుద్యోగ యువతకు జాబు రాలేదు. అలాగే 2024 ఎన్నికల్లో సంపద సృష్ట్టిస్తా, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా.. అంటూ జబ్బలు చరిచారు. అంతవరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించడం పక్కనబెట్టి, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయా..? అంటే అదీ లేదు. తాజాగా టీటీడీలో శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై భారం పడుతోంది.

దుమారం రేపిన సీఎం వ్యాఖ్యలు

‘తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు బుధవారం టీటీడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీవారి దగ్గర సేవ చేయాలి. ఉద్యోగం కాదు. శ్రీవారి సేవకోసం వైద్య, విద్య సేవకులు ముందుకొస్తున్నారు. సత్యసాయి ట్రస్ట్‌లో భక్తులకు ఎలాగైతే సేవ చేస్తున్నారో అదేవిధానం తిరుమలలో మరింత పెంచేలా శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవాలని. టీటీడీలో ఇప్పటికే దాదాపు 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకున్నారు. వీరిని ఆలయ సేవా కార్యక్రమాలకు అనుసంధానం చేస్తాం. వైద్యులను కూ డా శ్రీవారి సేవకులుగా అనుసంధానం చేసి టీటీడీ ఆస్పత్రుల్లో సేవలందించేలా చర్యలు చేపడుతాం’. అంటూ సీఎం స్థాయి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం నిరుద్యోగులను తీవ్ర నిరాశలో పడేసింది.

టీటీడీలో కొత్త ఉద్యోగాలకు గండి

ఆ వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలి

టీటీడీ ఉద్యోగులపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. శ్రీవారి సేవకుల పేరుతో శాశ్వత ఉద్యోగాలను తగ్గించే ఆలోచన సరికాదు. తిరుమలలో శాశ్వత ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసి, పనులను శ్రీవారి సేవకులతో చేయించుకోవాలనే విధంగా సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. భక్తులకు నిరంతరం సేవలందించే టీటీడీ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడడం వారి మనోభావాలను గాయపరుస్తోంది. శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలను గౌరవిస్తాం. అయితే, వారి సేవను శాశ్వత ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా చూపడం సరికాదు. పారిశుద్ధ్యం సహా తిరుమలలో రోజూ నిర్వహించాల్సిన పనులకు తగిన సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు అవసరం. ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య పోటీ పెట్టే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి. 2025–26 బడ్జెట్‌లో జీతాలు, ఇతర సిబ్బంది చెల్లింపులకు కేటాయించిన మొత్తం సుమారు 34 శాతం. ఈ కేటాయింపులో జీతాలతో పాటు ఇతర సిబ్బంది చెల్లింపులూ ఉన్నాయి. దాన్నంతటినీ సాధారణ ఉద్యోగుల జీతంగా చూపడం సరైంది కాదు. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి.

– కందారపు మురళి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement