డయల్‌ యువర్‌ సీఎండీకి 2,249 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ సీఎండీకి 2,249 ఫిర్యాదులు

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

తిరుపతి రూరల్‌: ‘డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ’ కార్యక్రమానికి వివేష స్పందన లభిస్తోందని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. 9 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 2,249 ఫిర్యాదులు అందగా, 1,898 సమస్యలు పరిష్కరించినట్లు వెల్లడించారు. గురువారం ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎండీ.. ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమంలో నమోదైన ఫిర్యాదులు, పరిష్కార స్థితి, పెండింగ్‌ అంశాలపై సమీక్షించారు. 2025 నవంబర్‌ 3 నుంచి 2026 సెప్టెంబర్‌ 14 వరకు 2,249 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. 9 జిల్లాల్లో ‘డయల్‌ యువర్‌ సీఎండీ’, ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాల ద్వారా నమోదవుతున్న ఫిర్యాదులపై నోడల్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎండీ ఆదేశించారు. సంస్థ డైరెక్టర్‌ కె.గురవయ్య, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు, జనరల్‌ మేనేజర్లు, 9 జిల్లాల సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement