– వృద్ధుడి మృతి
నాయుడుపేటటౌన్: మండల పరిధిలోని మేనకూరు సెజ్ వద్ద లాయల్ పరిశ్రమ సమీపంలో రహదారిపై సోమవారం సాయంత్రం బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓజిలి మండలం, మానవాలి గ్రామానికి చెందిన ముసులూరు గోపాలయ్య(65) మృతిచెందాడు. పోలీసుల కథనం.. మానవాలి గ్రామానికి చెందిన గోపాలయ్య బైక్‌పై మేనకూరు గ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యంలో రాయల్ టైక్స్‌టైెల్స్ పరిశ్రమ సమీపంలో రహదారి వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపాలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శివశంకర్ తెలిపారు.
పోక్సో కేసుపై విచారణ
నాయుడుపేట టౌన్: పోక్సో కేసుపై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విచారణ చేపట్టారు. మండల పరిధిలోని మేనకూరు గ్రామానికి చెందిన కందాటి రజనీపై ఇటీవల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశం, తదితర ప్రదేశాలను డీఎస్పీ ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. డీఎస్పీతో పాటు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శివశంకర్ ఉన్నారు.


