తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలంలోని విరూపాక్షాపురంలో సోమవారం రాత్రి ఒకేసారి 8 మంది రైతులకు చెందిన విద్యుత్ మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధిత రైతులు వెంకటేష్, రమణయ్య, కాటయ్య, మనోహర్, పరమేష్ రెడ్డి, బత్తయ్య, సుబ్రహ్మణ్యం, రమేష్ మంగళవారం ఉదయం పొలాలకు వెళ్లి చూడగా స్టార్టర్ బాక్సులు పగలగొట్టి వైర్లు కత్తిరించి మోటార్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఇటీవలే చిట్టత్తూరులో నలుగురు రైతుల మోటా ర్లు చోరీ కాగా ఇప్పుడు విరూపాక్షీపురంలో ఏకంగా 8 మోటార్లు మాయం కావడంతో రైతులు భ యాందోళనకు గురవుతున్నారు. పక్కా ప్రణాళిక తో ఒకే ముఠా ఈ చోరీలకు పాల్పడుతోందని అ నుమానిస్తున్నారు. వర్షాలు లేక అప్పులతో ఇబ్బంది పడుతున్న తరుణంలో లక్షల విలువైన మోటా ర్లు దొంగలించడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


