చిట్వేలి: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం మదనపల్లిలో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సింధు, దిలీప్, సమద్, ఏడో తరగతి విద్యార్థులు లక్ష్మీనారాయణ, లాస్యకుమార్, శివనందు, ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షవర్దన్, తొమ్మిదో తరగతి చదువుతున్న తనూజ, గ్రీస్మిత సాయి యోగాసన జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్టు వెల్లడించారు. యోగాసన స్టేట్ మీట్‌కు ఎంపికై న విద్యార్థినీ విద్యార్థులను ఇన్‌చార్జ్ హెడ్మాస్టర్ సోఫియా అభినందించారు.


