ఇంటి పట్టాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఇంటి పట్టాల పంపిణీ

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

రిజిస్ట్రేషన్‌ చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం

ఇంకా ముళ్లపొదల్లోనే ప్లాట్లు

వెంచర్ల అభివృద్ధి ఇప్పట్లో లేనట్టే

మౌలిక సదుపాయాలకు

వంద కోట్లు అవసరం

తుడాకి అంత సీనుందా?

వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు హడావుడి చేసేందుకు ఎత్తులు

విధి నిర్వహణలో వీరమరణం పొందిన అటవీశాఖ అధికారుల కుటుంబాలకు కలెక్టర్‌ ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.

బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

శెట్టిపల్లి భూ సమస్యకు చంద్ర గ్రహణం పట్టుకుంది. గత ప్రభుత్వ క్రెడిట్‌ని చోరీ చేసేందుకు బాబు సర్కార్‌ ఇటీవల శెట్టిపల్లి భూ బాధితులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేసి చేతులు దులుపుకుంది. అయితే లబ్ధిదారుల ప్లాటు ఎక్కడన్నది కనుగొనే పరిస్థితి ఇప్పట్లో కనిపించేలా లేదు. వెంచర్లను అభివృద్ధి చేయాలంటే తుడా కనీసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం అంత డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి తుడాకు లేకపోవడంతో శెట్టిపల్లి భూ సమస్య ఎక్కడ వేసినగొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు సాగదీసేందుకు యత్నిస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

లబ్ధిదారులకు కేటాయించే శెట్టిపల్లి భూమి

చెప్పింది ఎక్కువ

వెంచర్ల అభివృద్ధి లెనట్టే

శెట్టిపల్లి లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మాత్రమే చేసిన కూటమి ప్రభుత్వం వెంచర్లను అభివృద్ధి చేసి ప్లాట్లను చూపించే ప్రక్రియ ఇప్పట్లో పూర్తిచేసేలా కనిపించడం లేదు. స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్లాట్లను యజమానులు ఇది నాది అని చూసుకునే ఆశ ఇప్పట్లో తీరేలా లేదు. ముళ్లపదల్లోనే ప్లాట్లు ఉండడంతో భూ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. వెంటనే ప్లాట్లను అభివృద్ధి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు.

తిరుపతి తుడా : శెట్టిపల్లి భూ సమస్య ఏడు దశాబ్దాల నాటిది. 636 ఎకరాల భూమి వివిధ కారణాలతో అన్‌ సెటిల్మెంట్‌గానే మిగిలిపోయింది. స్థానిక రైతులు, ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లు అలాగే ఉండిపోయాయి. ఇలా నాటి నుంచి ఆ భూములపై రైతులకు ఎలాంటి హక్కులు కల్పించకుండా అన్‌ సెటిల్మెంట్‌ గానే ప్రభుత్వాలు పరిగణిస్తూ వచ్చాయి. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో స్థానిక భూ బాధితులు నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ భూమన అభినయరెడ్డిని కలిసి సమస్యను వివరించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చలు జరిపి, లబ్ధిదారులను ఒప్పించి, లీగల్‌ సమస్యలను అధిగమించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ఈ క్రమంలో 2023 డిసెంబర్‌ 15న రాష్ట్ర క్యాబినెట్‌ శెట్టిపల్లె భూసమస్యకు పరిష్కారం చూపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఉన్న భూముల్లో వ్యవసాయ రైతులకు 30 శాతం (ప్రభుత్వానికి మిగిలేది 70 శాతం), లే అవుట్ల ద్వారా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారికి 50 శాతం (ప్రభుత్వానికి మిగిలేది 50 శాతం) గా నిర్ణయించింది. రికార్డులను పరిశీలించి అంతే వేగంగా 2024 ఫిబ్రవరిలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన భూ హక్కులను కల్పిస్తూ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఇంతలో ఎన్నికల కోడ్‌ రావడంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగింది. మిగిలిన ప్రక్రియలన్నీ పూర్తిగా గత ప్రభుత్వ హయాంలోనే పరిష్కరిం చేశారు.

క్రెడిట్‌ చోరీకి యత్నం

గత ప్రభుత్వ హాయంలో శెట్టిపల్లె భూ సమస్యకు దాదాపు పరిష్కారం చూపేశారు. అప్పటికే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు శెట్టిపల్లె భూ సమస్యను పరిష్కరించేందుకు ఏనాడూ ముందుకు రాలేదు. ప్రతి ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటనలు చేయడం ఆపై వాటిని విస్మరించడం బాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వనప్పటికే దాదాపు పూర్తయిన ఈ సమస్యను తానే పరిష్కరిస్తున్నట్లు మరో క్యాబినెట్‌ తీర్మానం చేయించారు. గత ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం, ప్రొసీడింగ్స్‌ ఆధారంగా ప్లాట్స్‌ కొనుగోలు చేసిన యజమానులకు రిజిస్ట్రేషన్‌ లను చేపట్టింది. ఇక ఈ సమస్యను అక్కడితో వదిలేసి చేతులు దులుపుకుంది. రైతులకు సంబంధించిన మరో 22 ఎకరాల భూ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

శెట్టిపల్లికి చంద్ర గ్రహణం

రూ.100 కోట్లు అవసరం

శెట్టిపల్లి లబ్ధిదారులకు దాదాపు 60 ఎకరాల్లో నాలుగు వెంచర్లను వేశారు. ఈ వెంచర్లు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ వెంచర్లలో ఫ్లాట్లు విభజన రోడ్లు, యూడీఎస్‌, కాలువలు అభివృద్ధి చేయాలంటే తుడా కనీసం రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో తుడా లేకపోవడంతో ఇప్పట్లో వెంచర్లు అభివృద్ధి చేసే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. టౌన్‌షిప్‌ నిర్మాణం కోసం తుడాకు కేటాయించిన దాదాపు 90 ఎకరాలను అభివృద్ధి చేసి, వాటిని విక్రయించాలంటే కనీసం ఏడాదన్నర పడుతుంది. అలా విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతోనే వెంచర్లను అభివృద్ధి చేసి ఫ్లాట్లు చూపించే అవకాశం ఉంటుంది. అంతకుమించి తుడాకు అభివృద్ధి చేసేందుకు ఏ అవకాశం లేదు. దీంతో ప్లాట్లు చూసే అవకాశం లబ్ధిదారులకు ఇప్పట్లో లేనట్టే. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు శెట్టిపల్లి ఫ్లాట్లను అభివృద్ధి చేసేందుకు హడావిడి చేసి లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement