తిరుపతి రూరల్:శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాల యం ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పాఠశాలలో 2026 –30 బ్యాచ్ బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సోమవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. బేసిక్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో విద్యార్థులకు విద్య, కెరీర్, వసతి, పరీక్షలు, ప్లేస్‌మెంట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.ఉమా మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో నిర్ణయ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలు కీలకమన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉషా మాట్లాడుతూ విజయవంతమైన కెరీర్‌కు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని సూచించారు. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పాఠశాల డైరెక్టర్ ప్రొఫెసర్ పి.మల్లికార్జున బీటెక్ కోర్సుల పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల బాధ్యతలను వివరించారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 7 వరకు నిర్వహించిన మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రామ్ నివేదికను డాక్టర్ ఎన్.రామజ్యోతి సమర్పించారు. ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.మల్లికార్జున, బీఎస్‌అండ్‌హెచ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.సుప్రియ, డాక్టర్ ఎన్.రామజ్యోతి పాల్గొన్నారు.


