పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పుస్తకావిష్కరణ

Sep 8 2026 2:17 AM | Updated on Sep 8 2026 2:17 AM

తిరుపతి కల్చరల్‌:జ్ఞాన ముక్తి సాధనంగా అన్నమయ్య కు పదార్చన పుస్తకాన్ని వెంకటపతి స్వామి రచించార ని ఎస్‌వీ వేదిక్‌ యూనివర్సిటీ వీసీ ఆచార్య రాణి సదాశిమూర్తి తెలిపారు. విశ్వామిత్ర సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో వేంకటపతి స్వామి రచించిన ‘అన్నమయ్యకు పదార్చన’ పుస్తకావిష్కరణ ఆదివారం శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నమయ్యకు పదార్చన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆలిండియా రేడియో మాజీ డైరెక్టర్‌ మల్లేశ్వరరావు సమన్వ య కర్తగా వ్యవహరించగా ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ గాలి గుణశేఖర్‌, సూ ర్యచంద్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ఏనుగు అంకమ నాయుడు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్‌ కే.సుబ్రమణ్యం, పరిహార సేవ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బి.చక్రపాణి పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు మధు సూదన్‌, ప్రియాంక, డాక్టర్‌ ఆశాదీపిక, కుమారి రిషిత ఆలపించిన సంకీర్తనలు శ్రోతులను అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement