పులికాట్ సరస్సులో చేపల వివాదానికి సంబంధించి తమిళనాడు–ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారుల మధ్య తరచూ జరుగుతున్న వివాదాల నేపథ్యంలో సరిహద్దులు తేల్చాలని మత్స్యకారులు పట్టుబట్టారు. ఆరు నెలలుగా క్రమంతప్పకుండా కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వస్తున్నా ఫలితం లేదని వాపోయారు. పులికాట్ సరస్సు ఆధారంగా 17 గ్రామాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు మత్స్యకారులు తమపై దాడులు చేయడంతోపాటు కేసులు పెడుతున్నారని వాపోయారు. ప్రధానంగా మంగోడు, చిన్న మంగోడు, కీర పుదుకుప్పం ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలు అధికంగా ఉన్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. మత్స్యకారుల సంఘం నేతలు ఏే.వాసు, మూర్తి, కే.వాసు, శివలింగం, రాజేంద్రన్, సంజయ్, వినోద్, ఆర్ముగం స్పష్టం చేశారు.


