తిరుపతి సిటీ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జి చైర్మన్‌గా ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు బాధ్యతలు చేపట్టారు. గతంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా సేవలందిస్తున్న ఆయనను ఆప్సీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్య, పరిశోధన, వాతావరణ శాస్త్రం, రేడియో కమ్యూనికేషన్, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఎస్వీయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఉన్నత విద్యారంగంలో పలు ఉన్నత హోదాలలో సేవలందించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ స్థాయికి చేరుకోవడంపై ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బీ దేవప్రసాద్‌రాజు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆయన ఆధ్వర్యంలో 150 కి పైగా పరిశోధనా పత్రాలను, 35 మంది పీహెచ్‌డీ, ఆరుగురు ఎంఫిల్ విద్యార్థులకు పరిశోధనా మార్గదర్శకత్వం అందించారని, 2012, 201లో నిర్వహించిన 104వ ఇండియన్ సైన్‌న్స్ కాంగ్రెస్‌కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించి తన నిర్వహణ సామర్థ్యాన్ని చాటుకున్నారని కొనియాడారు.


