ఉత్తర ప్రదేశ్‌ సీఎంకు సాదర స్వాగతం, వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తర ప్రదేశ్‌ సీఎంకు సాదర స్వాగతం, వీడ్కోలు

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

రేణిగుంట: తిరుపతి, నెల్లూరు జిల్లాల ఒక్కరోజు పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విమానాశ్రయంలో జిల్లా అధికారులు, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హెలికాఫ్టర్‌లో నెల్లూరు జిల్లా వెళ్లి, మళ్లీ సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనానంతరం రాత్రి విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌యాదవ్‌, నారాయణ, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌, ఎస్పీ ఎల్‌.సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్‌ ఉన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

శ్రీకాళహస్తి రూరల్‌: నెల్లూరు జిల్లా, అలూరులోని రామకృష్ణ కళాశాల మైదానంలో జరిగిన ఏపీ 12వ సీనియర్‌ పురుషుల అంతర్‌ జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్‌ చాపింయన్‌ షిప్‌లో శ్రీకాళహస్తికి చెందిన క్రాంతికుమార్‌ ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తి 1వ పట్టణ సీఐ వెంకటేష్‌, రూరల్‌ సీఐ ఇబ్రహీం క్రాంతికుమార్‌ను సత్కరించి అభినందించారు.

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

శ్రీకాళహస్తి రూరల్‌: శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐదు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పరిధిలో పోలీసులు సోమవారం ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. అందులో భాగంగా సరైన రికార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక, వ ట్టి తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్టు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement