ఆస్పత్రిలో సునీల్‌కి చికిత్స | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో సునీల్‌కి చికిత్స

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

అక్రమ కేసులో అరెస్టయిన యూట్యూబ్‌ చానల్‌ రిపోర్టర్‌ సునీల్‌ మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. సునీల్‌కి శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఛాతిలో తీవ్ర నొప్పిగా ఉండడంతో జైలు అధికారులు ఆదివారం సాయంత్రం రుయా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, స్కాన్‌కి పంపగా ఫ్రాక్చర్‌ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించి, అడ్మిట్‌ చేయాల్సిందేనని చెప్పారని సమాచారం. పై అధికారులకు చెప్పేంత వరకు వేచి చూడాల్సిందేనని ఆస్పత్రి వర్గాలు సుమారు 7–8 గంటలు చికిత్సకు తీసుకెళ్లకుండా వేచి ఉండమని చెప్పారు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్నా ఆస్పత్రి వర్గాలకు మానవత్వం కూడా లేకుండా వ్యవహరించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్‌ చానల్‌ రిపోర్టర్‌కి తీవ్రంగా ఛాతీ నొప్పి రావడానికి జేబీ శ్రీనివాసులు అనుచరులు తీవ్రంగా దాడి చేయడమేననే సునీల్‌ బంధువులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పరిణామాలు జేబీ వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దాయాలన్నా నిజం దాగేట్టు లేదని ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement