తిరుపతి అర్బన్ : వడమాలపేట మండలంలోని పాదిరేడు, ఏర్పేడు మండలంలోని పల్లం గ్రామాల వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ అంశంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భూ సేకరణలో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వివరించారు. అలాగే వైజాగ్–చైన్నె కారిడార్ పైప్ లైన్ పనులు, ఏపీఐఐసీకి సంబంధించి దుగ్గరాజుపట్నం పోర్ట్ పనులు, శ్రీసిటీకి చెందిన పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించారు. సమావేశంలో తిరుపతి, నెల్లూరు, చైన్నె పీడీలు వెంకటేశ్వర్లు, రమేష్, రవీంద్ర, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, విద్యుత్‌శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.


