నవోదయ ప్రవేశాలకు 7 వరకు గడువు | - | Sakshi
Sakshi News home page

నవోదయ ప్రవేశాలకు 7 వరకు గడువు

Aug 1 2026 1:13 AM | Updated on Aug 1 2026 1:13 AM

● వరుసగా రెండోసారి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ● 33 స్వర్ణాలు సహా మొత్తం 39 పతకాలు ● అత్యధికంగా 168 పాయింట్లతో సరికొత్త రికార్డు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 7వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఆ మేరకు కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచితంగా సీబీఎస్‌ఈ సిలబస్‌ విద్య, వసతిని అందిస్తారని, సిలబస్‌తో పాటు నీట్‌, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారని తెలిపారు. నవంబర్‌ 28వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారని, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఈ ఏడాది 5వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 86888 88802 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.

సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7లో మళ్లీ అకార్డ్‌ స్కూల్‌దే ఆధిపత్యం

తిరుపతి రూరల్‌: సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 అథ్లెటిక్స్‌ మీట్‌–2026లో తిరుపతికి చెందిన అకార్డ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా రెండో ఏడాది ఓవరాల్‌ చాపియన్‌గా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని మల్లారెడ్డి ఫౌండేషన్‌ స్కూల్‌ ఆవరణలో జరిగిన సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 అథ్లెటిక్స్‌ మీట్‌ – 2026లో అకార్డ్‌ స్కూల్‌ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచగా ఆ పాఠశాల రెండోసారి ఓవరాల్‌ చాపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 280 పాఠశాలల నుంచి 6,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో అకార్డ్‌ స్కూల్‌ విద్యార్థులు మొత్తం 39 పతకాలు సాధించారు. వీటిలో 33 స్వర్ణ, మూడు రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయని పాఠశాల ప్రిన్సిపల్‌ నీరజారెడ్డి తెలిపారు. అలాగే 168 చాపియన్‌షిప్‌ పాయింట్లు సాధించి, గత పదేళ్లలో ఏ పాఠశాల నమోదు చేయని అత్యధిక స్కోరును నమోదు చేస్తూ కొత్త రికార్డు సృష్టించినట్టు ఆమె తెలిపారు. ఈ విజయంపై అకార్డ్‌ స్కూల్‌ డైరెక్టర్లు ప్రశాంత్‌ రెడ్డి, వివేక్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ విద్యార్థులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు.

యూజీ సెకండ్‌ సెమ్‌ తొలి పరీక్ష వాయిదా

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో శనివారం నుంచి జరగనున్న యూజీ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కాగా తొలి రోజు శనివారం జరగవలసిన లాంగ్వేజ్‌ పరీక్షను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ రాజామాణిక్యం తెలిపారు. మిగిలిన పరీక్షలు యథాతథంగా సోమవారం నుంచి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే యూజీ ఐదో సెమిస్టర్‌ ఫలితాల్లో సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు ఇన్‌స్టెంట్‌ పరీక్ష కోసం ఈనెల 5వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు.

ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడస్తున్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలు గడువును పొడిగిస్తూ శుక్రవారం ఆ శాఖ ఉన్నతాదికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈనెల 17వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టవచ్చని తదుపరి గడువు పొడిగింపు ఉండదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement