విద్యుత్‌ సేవలపై ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సేవలపై ఆకస్మిక తనిఖీ

Aug 1 2026 1:13 AM | Updated on Aug 1 2026 1:13 AM

స్కూటర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ

సూపర్‌ లగ్జరీ బస్సు

ఘటనా స్థలంలోనే ఒకరి మృతి

స్విమ్స్‌లో చావుబతుకుల మధ్య మరొకరు

నారాయణవనంలో విషాద ఛాయలు

తిరుపతి రూరల్‌ : అన్నమయ్య సర్కిల్‌, పీలేరు డివిజన్‌ పరిధిలో సీఎండీ శివశంకర్‌లోతేటి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ప్రాణ స్నేహితులను

విడదీసిన మృత్యువు

నారాయణవనం: మృత్యువు వెంటాడింది. ఇద్దరు బాల్యమిత్రులను విడదీసింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి నారాయణవనంలో తీవ్ర విషాదం నింపింది. ఎస్‌ఐ గిరిబాబు కథనం.. నారాయణవనం పాత బజారు వీధికి చెందిన భరత్‌(28), బీసీ కాలనీకి చెందిన అన్నామలై(28) బాల్యం నుంచి స్నేహితులు. గురువారం రాత్రి మోటార్‌ సైకిల్‌పై ఇద్దరూ పుత్తూరుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో చైన్నె నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న కారును అదిగమించబోయి మోటార్‌ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నామలైకి తీవ్ర గాయాలయ్యాయి. మొదట అతన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఆ తర్వాత స్విమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించడం గుండెల్ని పిండేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement