ఎర్రచందనం దుంగలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో కారులో తరలిస్తున్న ఏడు ఎరచ్రందనం దుంగలను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి, అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును, పైలట్‌గా వ్యవహరించిన మోటారు సైకిల్‌ను సీజ్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఐ సి.వినోద్‌కుమార్‌ టీమ్‌ కడప జిల్లా బసాపురం వద్ద లోడింగ్‌ పాయింట్లను తనిఖీ చేపట్టారు. గురువారం తెల్లవారు జామున ఖాజీపేట సెక్షన్‌ పత్తూరు అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో నాగపట్నం వైపు నుంచి ఒక మోటారు సైకిల్‌, మరో కారు వేగంగా వస్తూ కనిపించాయి. టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బందిని చూసి వాహనాలు అపి దిగి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకున్నారు. కారులోని ఏడు ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబట్టిన వారిని కడప, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. కారు, మోటారు సైకిల్‌ తో సహా ముగ్గురు స్మగ్లర్లును తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ వీ.శ్రీనివాసులురెడ్డి, ఏసీఎఫ్‌ జె.శ్రీనివాస్‌ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్‌బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement