●
డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన కళాశాల ప్రాంగణం
రైల్వేకోడూరు అర్బన్: డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో మెరిసింది. యూనివర్సిటీ గ్రీన్ మెంటార్జ్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన ర్యాంకింగ్స్‌లో 16వ స్థానం సొంతం చేసుకుంది. దీనిపై స్థానికులతోపాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దినదినాభివృద్ధి
రైల్వేకోడూరు మండలం, అనంతరాజంపేట పంచాయతీ, ఉద్యాన పరిశోధన ప్రాంగణంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్యాన కళాశాల నిర్మాణానికి పునాది వేశారు. కానీ కళాశాల ప్రారంభించకుండానే ఆయన మృతిచెందారు. ఆపై మిగిలిన పనులు పూర్తి చేసి ఆయన పేరుతోనే డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీని ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేశారు. విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీని రైల్వేకోడూరుకే కాదు.. దేశానికే తలమానికంగా తీర్చిదిద్దారు.
ఆనందంగా ఉంది
రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజంపేటలో ఽఉద్యాన కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో విజయాలు సాధించింది. ఈ అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్, తరువాత ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషే కారణం. ఇప్పుడు ఈ ర్యాంకు రావడానికీ నాటి అభివృద్ధే నిదర్శనం. – పంజం వేణుగోపాల్‌రెడ్డి,
స్థానిక మాజీ సర్పంచ్, అనంతరాజుపేట


