శ్రమ దోపిడీపై యుద్ధమే | - | Sakshi
Sakshi News home page

శ్రమ దోపిడీపై యుద్ధమే

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయండి ఢిల్లీ తరహాలో ఉద్యమం తప్పదు కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా

తిరుపతి అర్బన్‌: ‘కార్మికుల శ్రమను ప్రభుత్వం నిలుపునా దోసుకుంటోంది. సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ఇక శ్రమదోపిడీపై యుద్ధమే’ అంటూ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తిరుచానూరు ఓవర్‌ బ్రిడ్జ్‌ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ కనీస వేతనం కోసం పోరాటం మొదలు పెట్టినట్లు చెప్పారు. కార్మికులకు రూ.26వే లు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. పోలీసులు రోప్‌ను ఉపయోగించి అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. రెగ్యులర్‌ చేయాలని కోరుతూ తిరుపతి జిల్లాలో 40 రోజులు పాటు కనీస వేతనాలు క్యాంపెయిన్‌ నిర్వహించామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్స్‌ను అమల్లోకి తీసుకొచ్చి వారికి తీవ్రమైన ద్రోహం చేస్తోందని ఆరోపించారు. పెరిగిన ధరలతో కుటుంబాలను గడవడం కష్టాంగా మారిందన్నారు.

ధరలు పెంపు సరికాదు

అమెరికా–ఇరాన్‌ యుద్ధం పేరుతో రాష్ట్రంలో ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యర్శి వందాసి నాగరాజు మండిపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పైసా వేతనం పెంచలేదన్నారు. న్యాయం చేయకుంటే ఢిల్లీ తరహాలో పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు.

ఉద్యోగ భద్రతపై దాడి సరికాదు

తోపులాట

పోలీసులు గురువారం కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో నేతలకు పోలీసులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. ధర్నాకు పలువురు మహిళలు చంటిబిడ్డలతో హాజరయ్యారు. తోపులాటల కారణంగా పలువురు నేతల చొక్కాలు చిరిగిపోయాయి. 30 మందికి పైగా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.జయచంద్ర, టి.సుబ్రమణ్యం, కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ జేఏసీ చైర్మన్‌ నాగవెంకటేష్‌, ఆప్కాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ ఆర్‌.లక్ష్మి, సీఐటీయూ జిల్లా నేతలు చంద్రశేఖర్‌, ప్రసాదరావు, రామకృష్ణ, గుణశేఖర్‌, వెంకటేష్‌, గురవయ్య, రమేష్‌, లక్ష్మయ్య, వేణు, వాణిశ్రీ, బుజ్జి, టీటీడీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.రఘు, వీ.ప్రభాకర్‌, ఆర్‌.సిద్ధు, డీ.పార్థసారథి, పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి రాము, ఏపీఎండీసీ యూనియన్‌ నాయకులు వెంకటేష్‌ హరినాథ్‌, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement