చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం గరుడ వాహనంపై శ్రీవారు విహరించారు. ఈ సందర్భంగా దేవదేవేరులకు కనులపండువగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం వేడుకగా స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం వైభవంగా ఊంజల్ సేవ చేశారు. అనంతరం గరుడునిపై స్వామివారిని కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. వైభవోత్సవాల్లో భాగంగా సోమవారం పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.


