రేణిగుంట: రేణిగుంట వారపు సంతలో గేటు వసూళ్ల దారులు రెచ్చిపోతున్నారు. వ్యాపారులు అడిగినంత ఇవ్వడం లేదని దాడులకు తెగబడుతున్నారు. మరికొందరిపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ బూతుపురాం అందుకుంటున్నారు. శనివారం రాత్రి రేణిగుంటలోని వారపు సంతలో భార్యాభర్త ఇద్దరు కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. గేటు వసూళ్లదారులు వచ్చి అధిక మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించడంతో భార్యాభర్తలిద్దరిపై దాడికి యత్నించారు. అడిగినంత ఇస్తేనే వ్యాపారాలు చేసుకోవాలని, లేదంటే మీకు దిక్కున చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. చుట్టుపక్కల వాళ్లు వీడియోలు తీయడం మొదలు పెట్టడంతో గేటు వసూళ్లుదారులు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ప్రతి వారం ఇలాంటివి నిత్యకృత్యంగా మారుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు.


