ఎస్వీయూలో జాబ్‌మేళా రేపు | - | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో జాబ్‌మేళా రేపు

Jul 19 2026 2:20 AM | Updated on Jul 19 2026 2:20 AM

తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ శ్రీనివాసులు తెలిపారు. పేరుగాంచిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 600 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలిపారు. ఎస్‌ఎస్‌స్సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమో, ఏదైని డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రేపటి నుంచి దస్తావేజు లేఖరుల నిరసనలు

శ్రీకాళహస్తి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీఓ నం.396ను నిరశిస్తూ సోమవారం నుంచి తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద దస్తా వేజు లేఖరులు, స్టాంపు వెండర్లు నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్‌ నిర్వహించనుండడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

స్టాంపుల కథ కంచికే

జిల్లాలో ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఆనుకొని అనేక మంది స్టాంపు వెండర్లు జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లైసెను్‌ుస్ల తెచ్చుకుని స్టాంపు వెండర్లుగా కాలం నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ నూతన విధానంతో అసలు స్టాంపు పత్రాలే అవసరం ఉండదు. తద్వారా రిజిస్ట్రేషన్లకు స్టాంపు పత్రాల కొనుగోలు అవసరం ఉండదు. ఫలితంగా వేలాది మంది స్టాంపు వెండర్లు జీవనోపాధి కోల్పేయే ప్రమాదం ఉంది.

సబ్‌ రిజిస్ట్రార్లకు వినతిపత్రాలు

జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న పెన్‌ డౌన్‌ కార్యక్రమానికి సంబంధించి శనివారం జిల్లాలోని అనేక చోట్ల దస్తావేజు లేఖరులు సంబంధిచి సబ్‌ రిజిస్ట్రార్లకు వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వం పునరాలోచించి ఆ జీఓను వెనక్కి తీసుకునే విధంగా కృషి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement