పోలీసులపై న్యాయ పోరాటం ప్రారంభం! | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై న్యాయ పోరాటం ప్రారంభం!

Jul 18 2026 9:39 AM | Updated on Jul 18 2026 9:39 AM

పులివర్తి నాని గలీజు మాటలు.. పోలీసులకు చాగంటి ప్రవచనాలా ‘నానీ’? తప్పు చేసే అధికారులకు న్యాయ పోరాటం రుచి చూపిస్తాం ప్రతి మండలానికి ఒక న్యాయ సేవా మండలి ఏర్పాటు చేస్తున్నాం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తులపైనే కేసులు పెడతారా? ఎమ్మెల్యే పులివర్తి నానికి రౌడీలతో రెక్కీలు చేయించడం కొత్తేమీ కాదు మీడియా సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: ‘తప్పు చేస్తున్న పోలీసులపై న్యాయ పోరాటాన్ని చంద్రగిరి నుంచే ప్రారంభిస్తున్నాం.. ఎమ్మెల్యే పులివర్తి నాని ఒక రిటైర్డ్‌ జడ్జి, ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను మాట్లాడిన గలీజు మాటలు.. పోలీసులకు చాగంటి ప్రవచనా లుగా అనిపిస్తున్నట్టుంది.. అందుకే ఆ మాటలపై తాము కేసు నమోదు చేయలేమని లిఖిత పూర్వకంగా రాసిచ్చే స్థాయికి దిగజారారు..? నీచ మాటలు మాట్లాడిన వ్యక్తిని వదిలేసి అతనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపైనే కేసులు పెడుతున్నారంటే మీరు పోలీసులా..? పసుపు చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తలా..? నోటీసులు.. బైండోవర్ల పేరుతో పోలీసులు భయపెట్టాలంటే భయపడతామా...? అరెస్టులకై నా సిద్ధంగానే ఉన్నాం.. తప్పుడు కేసులు, నోటీసుల్లో సంతకం పెట్టిన ప్రతి పోలీసును కోర్టు బోను ఎక్కిస్తాం.. అందుకోసమే చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో న్యాయ సేవా మండలిని ఏర్పాటు చేస్తున్నాం..’ అని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరితే, అవి అనుచిత వ్యాఖ్యల కిందకు రావని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేమని చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. ఒక మాజీ న్యాయమూర్తి, వృద్ధ దంపతులు, మాజీ ఎమ్మెల్యేపై పులివర్తి నాని మాట్లాడిన ప్రతి అనుచిత వ్యాఖ్యపై ప్రతి పంచాయతీ నుంచి వందలాది మంది ఫిర్యాదు చేస్తారని, వారందరిపై కూడా కేసులు పెట్టి నోటీసులు ఇస్తారా ? అని ప్రశ్నించారు. బైండోవర్‌ పేరుతో వేధింపులకు గురిచేస్తూ టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారిని కోర్టు ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. నీచ భాష మాట్లాడిన పులివర్తి నానిపై కేసు నమోదు చేయకుండా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన 50 మందితో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 200 మంది వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు బైండోవర్‌ పేరుతో నోటీసులు ఇవ్వడం పోలీసుల దిగజారుడు తనానికి నిదర్శనం కాదా..? అన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే పోలీసులపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, లోకాయుక్త, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు గవర్నర్‌, రాష్ట్రపతికి సంబంధిత అధికారులపై విచారణ కోరుతూ లేఖలు పంపి శిక్షలు పడేలా చేస్తామన్నారు.

ప్రతి మండలంలో న్యాయ సేవా మండలి

చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఇద్దరు న్యాయవాదులను నియమిస్తూ ‘చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో న్యాయ సలహా మండలి’ని ఏర్పాటు చేస్తున్నామని, తప్పు చేసే ప్రభుత్వ ఉద్యోగికి న్యాయపోరాటం రుచి ఎలా ఉంటుందో చూపించ బోతున్నామని హెచ్చ రించారు. పులివర్తి నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు.

భయపడతామా..?

పోలీసుల తప్పుడు కేసులకు.. నోటీసులు.. బైండోవర్ల పేరుతో భయపెడితే.. భయపడతామా..? పోరాటాలతో పుట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అన్న విషయం గుర్తుంచుకోవాలని మోహిత్‌ తెలిపారు.

నానీకి రెక్కీలు చేయించడం కొత్త కాదు

పులివర్తి నానీకి రౌడీల ద్వారా రెక్కీలు చేయించడం కొత్త ఏమీ కాదని, 2019 ఎన్నికల సమయంలో తమపైనే రెక్కీ చేయించేందుకు ఇద్దరు వ్యక్తులను డ్రైవర్లుగా పంపించి అడ్డంగా దొరికిపోయారని మోహిత్‌ గుర్తుచేశారు. అలాగే రిటైర్డ్‌ జడ్జి గుర్రప్పనాయుడు ఆఫీసు వద్ద రెక్కీ నిర్వహించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఇళ్ల వద్ద రెక్కీలు చేయించి దాడులు చేసిన సంస్కృతి పులివర్తి నానిదేనన్నారు.

చంద్రగిరిలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు

చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, ఎమ్మెల్యే నాని కన్ను ఎవరి భూమిపై ఎప్పుడు పడుతుందో తెలియదని, ప్రజలందరూ తమ భూములను తరచుగా తనిఖీ చేసుకోవాల్సిందేనని మోహిత్‌ అన్నారు. ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ మూలం చంద్రమోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దామినేటి కేశవులు, చిన్నియాదవ్‌, మొగరాల హరిప్రసాద్‌రెడ్డి, కె.పవన్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement