రీ నీట్‌లో శ్రీచైతన్య విద్యార్థుల విజయకేతనం | - | Sakshi
Sakshi News home page

రీ నీట్‌లో శ్రీచైతన్య విద్యార్థుల విజయకేతనం

Jul 18 2026 9:39 AM | Updated on Jul 18 2026 9:39 AM

తిరుపతి సిటీ: ఎన్‌టీఏ గురువారం రాత్రి విడుదల చేసిన రీ నీట్‌ యూజీ ఫలితాల్లో తిరుపతిలోని పలు కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి అత్యుత్తమ ర్యాంకులను కై వసం చేసుకున్నారు.

శ్రీ చైతన్య విద్యార్థుల హవా

తిరుపతిలోని శ్రీచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు పలు కేటగిరీలలో సుమారు 145 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. విద్యార్థులు కే.మునిలక్ష్మీధర్‌ 1,574 ర్యాంకు, అభిజ్ఞరెడ్డి 1,800, సింధూర 3,004, ఉదయ్‌కుమార్‌ 3,467, దేవిదుర్గ 3,798, యశ్వంత్‌నారాయణ 3,998 ర్యాంకులు సాధించగా 10 వేల లోపు 14 ర్యాంకులు, 20 వేల లోపు 36 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను డైరెక్టర్లు సుష్మశ్రీ, నాగేంద్రబాబు, ఏజీఎం బీవీ.ప్రసాద్‌, డీన్‌లు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభినందించారు. ఏజీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ర్యాంకులు వస్తాయని, వాటి ఆధారంగా ఎంబీబీఎస్‌లో సీట్లు కేటాయిస్తారని చెప్పారు.

నారాయణ విద్యార్థుల ప్రతిభ

తిరుపతి నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని డీజీఎం కొండలరావు తెలిపారు. విద్యార్థులు వైశాలి భాస్కర్‌ 284, నవ్యశ్రీ 578, భరత్‌ 1,564, సాయి మౌనిష 1,857, రెడ్డి ప్రవర్థిని 1,991, హిమేష్‌ చాంద్‌యాదవ్‌ 2,830 ర్యాంకులు సాధించారని చెప్పారు. వీటితో పాటు మరో 70 మంది విద్యా ర్థులు ఎంబీబీఎస్‌ సీట్లు సాధించబోతున్నారని తెలిపారు. ప్రతిభ చూసిన విద్యార్థులను డీన్లు శ్రీనివాసరావు, వేణుగోపాల్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement