వైభవంగా జగన్నాథుని రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా జగన్నాథుని రథయాత్ర

Jul 17 2026 7:27 AM | Updated on Jul 17 2026 7:27 AM

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ ఉత్కల పీఠం జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో పూరి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. గురువారం సాయంత్రం వర్సిటీ నుంచి ప్రారంభమైన జగన్నాథ రథ యాత్ర తిరుపతి పురవీధుల్లో వైభవంగా సాగింది. కార్యక్రమంలో డీన్‌ రజనీకాంత్‌శుక్ల, రిజిస్ట్రార్‌ వెంకటనారాయణరావు, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

రేపటి నుంచి

‘అభినయ’ కళా వేడుకలు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సౌజన్యం, దాతల సహకారంతో అభినయ ఆర్ట్స్‌ 26వ వార్షికోత్సవ కళావేడుకలు ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించన్నుట్లు అభినయ ఆర్ట్స్‌ కార్యదర్శి బి.ఎన్‌.రెడ్డి తెలిపారు. గురువారం ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. మహతిలో ఉదయం 9.30 నుంచి రాత్రి 8.30 గంటల 8 పద్య నాటకాలు, 12 సాంఘిక నాటికల ప్రదర్శన ఉంటుందన్నారు. ఇవీ కాకుండా 280 కూచి పూడి, భరతనాట్యం, జానపద బృంద, సాంస్కృతిక నృత్య పోటీలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అంతరించిపోతున్న కళలను భావితరాలకు చెప్పే ప్రయత్నంలో భాగమే ఈ నాటక ప్రదర్శనలు అన్నారు. సమావేశంలో అభినయ ఆర్ట్స్‌ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథ్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు కోసంగి సిద్ధేంద్రశర్మ, దామోదర్‌గుప్త పాల్గొన్నారు.

బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రారంభం

తిరుపతి సిటీ: ఎస్వీయూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో వర్సిటీలో గురువారం బ్యాడ్మింటన్‌ సింథటిక్‌ కోర్టును వీసీ నర్సింగరావు లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వర్సిటీలో విద్యార్థులను క్రీడలవైపు ప్రోత్సహించేందుకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం మరింత కృషి చేస్తోందన్నారు. రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం.శివశంకర్‌రెడ్డి, ఎగ్జామినేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సురేంద్రబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement